ఇవాళ టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు. 61 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వెంకీకి పలువురు సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. వెంకీ తన కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేశారు. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఎందరో హీరోయిన్లను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు. 1960, డిసెంబర్ 13న ప్రకాశం జిల్లా కారంచేడు లో జన్మించాడు వెంకి. ఇవాల్టితో వెంకి 62వ ఏటా అడుగుపెట్టనున్నారు. ప్రముఖ నిర్మాత కుమారుడిగానే కాకుండా, నటనలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు వెంకీ.
వెంకటేష్ 1986లో కలియుగ పాండవులు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రవేశం చేశారు. నటుడిగా రెండేళ్ల ప్రయంలోనే ఆయన విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వర్ణకమలంలో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అదే సంవత్సరంలో విడుదలైన వారసుడోచ్చాడు చిత్రం కూడా ఆయనకు మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత కొన్ని పరాజయాల తర్వాత బొబ్బిలి రాజా సినిమా సూపర్ హిట్ కావడంతో వెంకీ మరోసారి ఫామ్ లోకి వచ్చాడు.
వెంకటేష్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేశారు. వెంకీని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావునే. వెంకటేష్ ని కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు కథానాయకుడుగా పరిచయం చేశారు. ఈ సినిమా మంచి ప్రజాదరణ పొందడంతో పాటు వెంకటేష్ కు నూతన కథానాయకుడుగా నంది అవార్డు లభించింది. ఆ తర్వాత ప్రేమ, ధర్మచక్రం, చంటి, స్వర్ణకమలం, గణేష్, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో వెంకటేష్ కు నంది అవార్డులు దక్కాయి. ఇక ఇటీవల ఓరీ దేవుడా సినిమా గెస్ట్ రోల్ నటించి.. మంచి మార్కులు కొట్టేశారు వెంకీ.