ఎన్టీఆర్ ల్యాండ్ వివాదంలో బిగ్ ట్విస్ట్..!

-

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించినట్టు ఉదయం నుంచి వార్తలు వినిపించడం అందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ ప్రాపర్టీ ఓనర్ సుంకు గీత లోన్ తీసుకున్నట్లు దాంతో బ్యాంకులు సర్ఫేసీ యాక్ట్‌ కింద డెట్‌ రకవరీ ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు.

దీనిపై విచారణ జరిపిన డీఆర్‌టీ ఎన్టీఆర్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఆ స్థలంపై ఎన్టీఆర్‌కు ఎలాంటి హక్కులేదని, ఆ ప్రాపర్టీ మొత్తం బ్యాంకులదే అని తీర్పు ఇచ్చింది. ఈ వార్త ఉదయం నుంచి తెగ వైరల్ అవుతుంది. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ఆ ప్రాపర్టీని ఎన్టీఆర్ 2013లోనే అమ్మినట్లు తెలిపింది. ఇకపై ఆ ప్రాపర్టీపై వార్తలు రాస్తే ఎన్టీఆర్ పేరును ప్రస్తావించవద్దని కోరారు. అయితే దీనిపై సైతం నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర, వార్2 చిత్రాలలో నటిస్తున్నారు. హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న వార్2 చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాత్ర ద్వారా బాలీవుడ్ రంగప్రవేశం చేస్తున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆకలితో ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news