తిరుమల ఘాట్ రోడ్‌లో ప్రమాదం.. మినీ వ్యాను బోల్తా..!

-

తిరుమల మొదటి ఘాట్ రోడ్డు మాల్వాడి గుండం వద్ద ప్రమాదం జరిగింది. మినీ వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, రోడ్డుపై పడ్డ మినీ వ్యాన్ నుండి డీజిల్ లీక్ అయ్యింది. డీజిల్ కారణంగా టీటీడీ వాటర్ ట్యాంకర్ స్కిడ్ అయ్యింది. వాటర్ ట్యాంకర్ రోడ్డుకు ఆడ్డంగా నిలబడిపోయింది. దీంతో ఘాట్ రోడ్డులో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు.

ఈ మధ్య కాలంలో ఎక్కువగా తిరుమలలో ఓ వైపు రోడ్డు ప్రమాదాలు.. మరోవైప చిరుత దాడులు ఎక్కువగా చోటు చేసుకోవడం గమనార్హం.  ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కానీ ఈ ప్రమాదాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోవడం గమనార్హం. అక్కడక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ వాహనదారులు అతివేగంతో నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలను ఎవ్వరూ కోల్పోకపోవడం కాస్త సంతోషకరమనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news