హైదరాబాద్ మహా నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రియురా లు, తల్లిని కత్తితో పొడిచాడు ఓ ప్రియుడు. ఈ సంఘటన మియాపూర్ ఆదిత్య నగర్ లో ఇవాళ చోటు చేసుకుంది. ప్రియురాలు, తల్లిని కత్తితో పొడిచాడు ప్రియుడు సందీప్.
దీంతో ప్రియురాలు, ఆమె తల్లి తీవ్ర గాయాల పాలయ్యారు. ఇక ప్రస్తుతం కొండాపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి బాధితులను తరలించారు స్థానికులు. ప్రేమ వ్యవహారమే గొడవకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు. అటు ఈ దారుణమైన సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.