ఈ సినిమా వసూళ్ళు వచ్చాయి! మరి ఆ సినిమావి ఏమయ్యాయి.!

-

ఈ రోజుల్లో తాము విజయం సాధిస్తే ఒక రకంగా అలాగే ఓటమి పాలు అయితే మరో రకంగా స్పందిస్తూ ఉంటారు. ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయి దాటి పోయి ఫాన్ వరల్డ్ వైడ్ గా మారి పోయింది. ఇప్పుడు ప్రతి చిన్న హీరో కూడా పాన్ ఇండియా అంటూ పాట అందుకుంటున్నారు.

దీని అంతటికీ కారణం మన దర్శక దిగ్గజం ఆర్ఆర్ఆర్ సినిమాతో రికార్డ్స్ బ్రేక్  చేసిన రాజమౌళి. ఇప్పుడు తన తర్వాత సినిమా పై మనకంటే దేశంలో ఎక్కువుగా ఆసక్తి వుంది. అలాగే రీసెంట్ గా జపాన్ లో ఆర్ఆర్ఆర్ విడుదల చేస్తే  వసూళ్ల లోఇండియా దేశ సినిమాల్లో నంబర్ వన్ గా నిలిచింది. ఈ సినిమా గురించి జపాన్ లో ప్రతి వారం ఎంత వసూలు చేస్తుంది ఏ సినిమాను ఈ వారం దాటింది అంటూ అప్డేట్స్ వచ్చాయి.

Allu-Arjun
Allu-Arjun

విచిత్రంగా అలాంటి అప్డేట్స్ రావలసిన మరో సినిమా నుండి వసూళ్ల అప్డేట్స్ రావటం లేదు మీరు గమనించారా. ఆ సినిమా  అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 1. ఈ సినిమా రష్యా లో విడుదల కోసం సినిమా యూనిట్ అక్కడకు వెళ్లి సందడి చేసింది. అప్పట్లో ఈ విషయం పై వార్తలు హల్చల్ చేశాయి.అయితే సినిమా డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ కాగా అక్కడ జనాలు ఎవరు కూడా పట్టించుకోలేదట.దీంతో దారుణంగా కలెక్షన్స్ రావడంతో మొదటి మూడు రోజుల్లోనే సినిమాను థియేటర్లలో నుంచి తీసివేసినట్లుగా తెలుస్తోంది. అందుకే వసూళ్ల వివరాలు బయటకి రావటం లేదట అదీ సంగతి.

Read more RELATED
Recommended to you

Latest news