ఏం గుండె ధైర్యంరా బాబూ.. జీపులోకి చీతా వచ్చినా అస్సలు భయపడకుండా…

-

సాధారణంగా ఫారెస్ట్ ఏరియాస్‌లో ప్రయాణించేప్పుడు మనకు పులులు రోడ్డు దాటుతూ కనిపిస్తాయి.. మనం కూడా దూరంగా ఉండి వీడియో తీస్తాం.. అలా చేయడానికి మనకు చుక్కలు కనిపిస్తాయి. అయితే అంతకు మించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. జీపులో ఓ వ్యక్తి కుర్చున్నాడు..వెనక సీట్‌లో చీతా ఉంది. అంత ప్రమాదకరమైన జంతువు జీపులోకి వచ్చినా.. ఆ వ్యక్తి మాత్రం ఏమాత్రం భయపడకుండా వీడియో రికార్డ్‌ చేశాడు.. అదృష్టవశాత్తూ ఆ చీతా కూడా అతన్ని ఏం చేయలేదు.. లేకపోతే సీన్‌ వేరేలా ఉండేది..!!

చిరుత జీపులోకి దూకింది,వ్యక్తి నిర్భయంగా ఉన్నాడు

వైరల్ అవుతున్న వీడియోలో..ఒక వ్యక్తి జీపులో కుర్చోని ఉంటాడు.. జంగిల్ సఫారీ..ఇంతలో ఎదురుగా ఒక చీతా వచ్చి అతని జీపులోకి దూకింది. ఆ జీపులోని వ్యక్తి భయపడకుండా చిరుతపులిని వీడియో రికార్డ్ చేస్తూనే ఉండటం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సమయంలో చిరుత కూడా వ్యక్తికి హాని కలిగించలేదు. జీపులోని వస్తువులను చూసిన తర్వాత మాత్రమే వెళ్లిపోతుంది. అయితే ఆ జీపులోని వ్యక్తి ధైర్యం చూసి చూపరులు చలించిపోతున్నారు.

ఈ వీడియో @TansuYegen పేరుతో ఉన్న ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్ చేశారు.. 1 నిమిషం 7 సెకన్ల నిడివి గల వీడియోకు ఇప్పటి వరకు లక్షల వ్యూస్, లైక్స్ వచ్చాయి. ఆ సమయంలో ఆ వ్యక్తి భయపడి ఉంటే.. చీతా కూడా కంగారు పడి ఏదో ఒకటి చేసి ఉండేది.. మనం కూల్‌గా ఉండేసరికి అది కూడా కూల్‌గా వెళ్లిపోయిందని నెటిజన్లు కమెంట్‌ చేస్తున్నారు.

జనరల్‌గా మనకు ఏదైనా హాని కలిగించే జంతువులు ఎదురుపడినప్పుడు మనం వాటిని చూసి కంగారుపడతాం, పరిగెడతాం.. దాంతో ఆ జంతువులు కూడా తమకు ఎక్కడ హాని కలిగిస్తాయో అని వాటిని అవి రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా మనకు హాని చేస్తాయి. అలా అని మనకు పారిపోయే అవకాశం ఉన్నా కూడా అలానే ఉండిపోకూడదు.. సైంటిఫిక్‌గా ఇలా జరుగుతుందని మాత్రమే మేం చెప్తున్నాం..!!

Read more RELATED
Recommended to you

Latest news