ఫ్యాక్ట్ చెక్: CBSE బోర్డు పరీక్షల కోసం విద్యార్థులు ఈ వెబ్ సైట్ ద్వారా డబ్బులు కట్టవచ్చా…?

-

ఈ మధ్యన మోసాలకు హద్దే లేదు. స్కీమ్స్ మొదలు జాబ్స్ వరకు ఎన్నో ఫేక్ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి ఫేక్ వార్తలతో జాగ్రత్తగా ఉండకపోతే ఎన్నో బాధలు పడాలి. ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సోషల్ మీడియా లో వస్తున్న అని వార్తలని నమ్మకూడదు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు నకిలీ వార్తలు కనపడుతూ ఉంటాయి. అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. మరి అది నిజమా కాదా అనేది చూద్దాం. CBSE బోర్డు పరీక్షల కోసం విద్యార్థులు ఈ వెబ్ సైట్ లో వివరాలని చూడచ్చని.. CBSE బోర్డు పరీక్షల కోసం విద్యార్థులు ఫీజు కట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి నిజంగా https://cbsegovt.com/ ద్వారా విద్యార్థులు ఫీజు కట్టాలా https://cbsegovt.com/ అనేది నిజమైన వెబ్ సైట్ ఏనా అనేది ఇప్పుడు చూద్దాం.

CBSE బోర్డు పరీక్షలు అంటూ వచ్చిన వెబ్ సైట్ నకిలీది. ఇందులో నిజం ఏమి లేదు. అనవసరంగా మోసపోవద్దు. అలానే CBSE బోర్డు పరీక్షలు 2023 అంటూ డేటా షీట్ కూడా మొన్న వచ్చినది. అది కూడా నకిలీదే. “http://cbse.gov.in” అనేదే అధికారిక వెబ్ సైట్. కనుక అందులో వచ్చిన సమాచారాన్ని నమ్మండి తప్ప తక్కిన వాటిలో వచ్చిన వాటిని నమ్మద్దు.

Read more RELATED
Recommended to you

Latest news