గడప గడపకు మన ప్రభుత్వంలో 32 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతే కాదు గడపగడపకు ప్రభుత్వంలో వెనుకబడ్డ ఈ 32 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి లోపు పనితీరు మార్చుకోవాలని.. లేదంటే కొత్త అభ్యర్థులను పెట్టవలసి వస్తుందని హెచ్చరించారు. ఏప్రిల్ వరకు పనితీరు మార్చుకోవాలని సీఎం డెడ్ లైన్ పెట్టారు.
175 నియోజకవర్గాలలో వైసిపి గెలవాల్సిందేనని జగన్ మరోసారి స్పష్టం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం తాడేపల్లి లో సమీక్ష నిర్వహించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా పాల్గొంటున్నారు అనే విషయమై నివేదికను తెప్పించుకున్నారు. ఈ నివేదిక ఆధారంగా సీఎం జగన్ నేడు ఆయా ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించి వార్నింగ్ ఇచ్చారు.