పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..!!

-

పవన్ కళ్యాణ్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.తన యాక్టింగ్, స్టైల్ తో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కొన్ని రోజులు రాజకీయాలలో కొన్ని రోజులు సినిమాలు చేస్తూ వస్తున్నాడు.ఇప్పుడు పవన్ కళ్యాణ్  ”హరిహర వీరమల్లు”. ఈ సినిమా లో నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా ఎప్పటి నుండో షూటింగ్ జరుపు కుంటూనే వుంది. పవన్ రాజకీయాల వల్ల అడ్డంకి  ఎదురవుతూనే ఉంది. రీసెంట్ గా  షూటింగ్  రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది.. పవన్ కళ్యాణ్ కూడా సినిమాని తొందరగా పూర్తి చేయాలని పట్టు దలతో వున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు సుజిత్ మరియు హరీశ్ శంకర్ లతో చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. కాని ఇప్పుడు”హరిహర వీరమల్లు సినిమా గురించి షాకింగ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది.

వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకూ సగం కూడా కాలేదట. ఇంకా చాలా షూటింగ్ చేయవలసి ఉందట. ఇది పూర్తి చేయటానికి చాలా టైమ్ పడుతుందని అంటున్నారు. పవన్ నుంచి కొత్తగా రెండు సినిమాలు వస్తున్నాయని అన్నప్పుడు ఈ సినిమా పూర్తి అయి వాటిని మొదలు పెట్టాలని చూస్తున్నారని అనుకున్నారు. కాని ఈ సినిమా ఇప్పట్లో పూర్తి కాదని తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవాక్కయ్యారు. సోషల్ మీడియాలో నెటిజన్స్ మాత్రం పాపం క్రిష్ కు ఇన్నేళ్ళు పట్టింది ఇక హరీశ్ శంకర్, సుజిత్ ల పరిస్థితి గురించి కామెడీ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news