HYD ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణ కసరత్తు వేగవంతం

-

హైదరాబాద్‌ మహానగరంలో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణ కసరత్తును హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ వేగవంతం చేసింది. ఎయిర్‌పోర్ట్‌ మెట్రో మార్గాన్ని ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఇంజినీర్లు, సర్వే అధికారులు సర్వే నిర్వహించారు. రాయదుర్గం మెట్రో స్టేషన్‌ నుంచి నార్సింగ్‌ జంక్షన్‌ వరకు మెట్రో మార్గాన్ని ఈ బృందం పరిశీలించింది. దాదాపు 10కి.మీ కాలినడకన ఎండీ, ఇంజినీర్లు, సర్వే బృందాలు పరిశీలించాయి.

స్టేషన్‌ స్థానాలు ప్రధాన రహదారి జంక్షన్‌లకు దగ్గరగా ఉండాలని ఎండీ అధికారులను ఆదేశించారు. ఎయిర్‌పోర్టు మెట్రో విమానాశ్రయ ప్రయాణికులకు మాత్రమే కాకుండా, అందరికీ ఉపయోగపడుతుందని తెలిపారు. తక్కువ ఆదాయ వర్గాల వారు కూడా నగర శివార్లలో మెరుగైన వసతి గృహాల్లో ఉండొచ్చని వెల్లడించారు. స్టేషన్‌లకు సమీపంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో విశాలమైన పార్కింగ్‌ సౌకర్యాలు కల్పించాలని, ఐకియా ముందు ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్‌, బ్లూ లైన్‌ కొత్త టెర్మినల్‌ నిర్మాణం జరపనున్నట్టు చెప్పారు.

రెండు కొత్త స్టేషన్లు ఒకదానిపై ఒకటి నిర్మాణం ఉంటుందని,  బయోడైవర్సిటీ జంక్షన్‌ ఫ్లైఓవర్‌ మీదుగా ఎయిర్‌పోర్టు మెట్రో వయాడక్ట్‌ క్రాసింగ్‌ను జాగ్రత్తగా ప్లాన్‌ చేయాలని మెట్రో ఎండీ సూచించారు. భవిష్యత్‌లో బీహెచ్‌ఈఎల్‌-లక్డీకాపూల్‌ మెట్రో కారిడార్‌ స్టేషన్‌ను ఏకీకృతం చేసేందుకు నిర్మాణం ఉండాలని.. విమానాశ్రయం మెట్రో బయోడైవర్సిటీ జంక్షన్‌ స్టేషన్‌ను ఒక ప్రత్యేక మార్గంలో ప్లాన్‌ చేయాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news