తెలంగాణ కాంగ్రెస్ నేతలను దారిలో పెట్టేందుకు ఆ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ కీలక నేత దిగ్విజయ్ సింగ్ కి అధిష్టానం ఈ బాధ్యతలను అప్పగించింది. దీంతో దిగ్విజయ సింగ్ కూడా వెంటనే రంగంలోకి దిగారు. సీనియర్ నేతలకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు దిగ్విజయ్ సింగ్. బట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలకు ఫోన్ చేశారు దిగ్విజయ్ సింగ్.
ఒకటి రెండు రోజులలో హైదరాబాద్ వస్తానని వారితో తెలిపారు. అలాగే నేడు సాయంత్రం జరగవలసిన సీనియర్ నేతల సమావేశం వాయిదా వేసుకోవాలని కోరారు. ఉత్తంకుమార్ తో 10 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడారు దిగ్విజయ్. ప్రస్తుతం తాను రాజస్థాన్ పాదయాత్రలో ఉన్నానని.. ఒకటి రెండు రోజులలోనే హైదరాబాద్ కి వస్తానని తెలిపినట్లు సమాచారం. ఇక్కడికి వచ్చాక అందరి అభిప్రాయాలు తీసుకొని, అన్ని విషయాలను చర్చించి నిర్ణయం తీసుకుందామని.. సమస్యని పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.