ఈరోజుల్లో భార్యభర్తల మధ్య గొడవలు జరగడానికి ప్రధాన కారణం.. టైమ్ ఇవ్వడం లేదు అనే ఉంటుంది.. ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు.. కానీ ఆఫ్‌డేస్‌లో అయినా ఒకరితో ఒకరు టైమ్ స్పెండ్ చేస్తారా అంటే ఎవరి ఫోన్ వారు వాడుతుంటారు. ఇది సవితి పోరు కంటే దారుణం.. బంధాలను
సెల్‌ఫోన్ బద్నాం చేస్తుందని తాజాగా జరిగిన ఓ సర్వేలో తేలింది.
సైబర్ మీడియా రీసెర్చ్, మనుషుల మీద ఫోన్ ఇంపాక్ట్ ఎంతలా ఉంది అనే విషయంపై సర్వే చేస్తే, షాకింగ్ రిజల్ట్స్ తెలిశాయి. మెజారిటీ కపుల్స్, ఫోన్ చూస్తున్నపుడు డిస్ట్రబ్ చేస్తే తమ భాగస్వామి మీద చిరాకు పడుతున్నారట. దీనివలన రిలేషిప్‌లో మనస్పర్థలు వస్తున్నాయని వాళ్లే ఒప్పుకున్నారు. 58% వినియోగదారులు భోజనం చేసేప్పుడు మొబైల్ ఫోన్స్ చూస్తూ తింటారట. నిద్ర లేచిన తర్వాత 15 నిమిషాల్లో 84 % ఇండియన్స్ ఫోన్ చేసుకుంటున్నారు..66% వినియోగదారులు ఫోన్ వల్ల మా లైఫ్ క్వాలిటీ పెరిగిందని నమ్ముతున్నారంట. 75% వినియోగదారులు ఫోన్ ఎక్కువగా వాడడం వలన మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. అంతేకాదు 74 శాతం నిర్ణీత సమయం పాటు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం సాధ్యం అవుతుందని చెప్పారు. అయినా సరే 18 శాతం మంది మాత్రమే తమ ఫోన్లను స్వయంగా స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలిపారట.
పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ వినియోగంలోని వివిధకోణాలను అంచనా వేస్తూ స్మార్ట్ ఫోన్ వినియోగపు పరిధి, లాక్ డౌన్ ప్రభావం, వ్యక్తిగత ఆరోగ్యం ఇతరత్రా అన్ని అంశాలను గురించి Vivo మొబైల్ కంపెనీ ‘Smartphones and their impact on human relationships 2020’ పేరుతో రెండో ఎడిషన్ ఫలితాలను వెల్లడించింది. స్మార్ట్ ఫోన్లు జీవితంలోనే అతి ముఖ్యమైనదిగా మారిపోయింది. స్నేహితులు, కుటుంబం, ప్రపంచం దేనితో కనెక్ట్ కావాలన్న సరే స్మార్ట్ ఫోన్ కావల్సిందే. ఇక కరోనా నేపథ్యంలో ప్రపంచం ఇంటికే పరిమితం అయిన సందర్భంలో దీని ప్రాముఖ్యత చాలా పెరిగింది. స్మార్ట్ ఫోన్లు యావత్ ప్రపంచాన్ని మన అరచేతుల్లోనే చూపిస్తుంది..
మానవ సంబంధాలపై స్మార్ట్ ప్రభావం గురించిన అధ్యయనం ద్వారా స్మార్ట్ ఫోన్ల వినియోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం గురించి ప్రజలకు అవగాహన కలిగించాలని వీవో ఇండియా లక్ష్యంగా పెట్టకున్నట్టు అధికారులు తెలిపారు.