చిన్మయి శ్రీపాద గాయనిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె స్త్రీవాది.. ఆడవారిపై జరిగే ఎలాంటి విషయాలకైనా మొహమాటంగా లేకుండా మాట్లాడటంలో ముందుంటుంది చిన్మయి.. మీ టు ఉద్యమం సందర్భంలో కూడా తనకు ఎదురైన అనుభవాలను మీడియా వేదికగా చెప్పుకొచ్చింది ఈ సమయంలో ఆమె ఒక ఇండస్ట్రీ నుంచి బ్యాన్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఎదుర్కొంది అయినప్పటికీ ఇలాంటి విషయాల్లో వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో మాట్లాడుతుంది అలాగే తాజాగా ఈమె చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి..
చిన్మయి.. ఎలాంటి విషయంలో అయినా ముందుకొచ్చి ధైర్యంగా మాట్లాడుతుంది అలాగే ఇప్పటివరకు ఆడవారిపై జరిగే విషయాల్లో తనదైన శైలిలో సపోర్ట్ ఇచ్చిన ఈమె తన వ్యక్తిగత విషయాల్లో కూడా ఎవరు ఏమన్నా వెనక్కి తగ్గదు అలాగే ఆమె తాజాగా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే ఈమె సరోగసి ద్వారా బిడ్డను కన్నారా అంటూ సోషల్ మీడియాలో చర్చకు దారి తీయగా తను ప్రెగ్నెంట్గా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికీ జవాబు ఇచ్చింది..
అలాగే తాజాగా ఈమె చేసిన కొన్ని కామెంట్స్ మరొకసారి చర్చకు దారి తీసాయి మీటు ఉద్యమం సమయంలో తమిళ లిరిసిస్ట్ వైరముత్తు తనతో తప్పుగా మాట్లాడాడు అంటూ మీడియా వేదికగానే చెప్పుకొచ్చింది మరొకసారి ఆయనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేసింది… తాజాగా తమిళ యువనటి అర్చన.. తాను వైరముత్తుని కలసినట్లు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది అలాగే అతనితో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది అయితే ఈ పోస్ట్ పై స్పందించిన చిన్మయి… ఎప్పుడూ కూడా అతడిని ఒంటరిగా కలవొద్దని అర్చనని హెచ్చరించింది. “ఇలాగే మొదలవుతుంది. దయచేసి జాగ్రత్తగా ఉండు. సాధ్యమైనంతవరకు అతడిని దూరం పెట్టు. అతడిని ఒంటరిగా కలవొద్దు. ఒకవేళ కలవాల్సి వస్తే నీ పక్కన ఇంకెవరైనా ఉండేలా జాగ్రత్తపడు.. ” అంటూ చిన్మయి అర్చనని హెచ్చరించింది. ప్రస్తుతం అతనిపై చిన్మయి చేసిన ఈ కామెంట్స్ పెద్ద చర్చకు దారి తీసాయి..