కార్తికేయ 3 లో ఆ స్టార్ హీరో ఉన్నాడా..?

-

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ఇటీవల తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న హీరో నిఖిల్ గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే కార్తికేయ 2 సినిమా తర్వాత 18 పేజీస్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమా విడుదల అవుతుండగా ఇందులో హీరోయిన్ గా మరొకసారి అనుపమ నిఖిల్ సరసన జతకట్టనుంది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో గీత అనుబంధ సంస్థ గీత ఆర్ట్స్ 2 నిర్మించిన ఈ సినిమాకి సుకుమార్ రచయితగా పనిచేశారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిఖిల్ తన తదుపరి సినిమాలకు సంబంధించిన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కార్తికేయ 3సినిమా ఎప్పుడు మొదలవుతుంది ?ఎలా ఉండబోతోంది? అనే ప్రశ్నలు ప్రమోషన్స్ లో భాగంగా ఆయనకు ఎదురయ్యాయి. దీనికి సమాధానంగా ఈ ప్రాజెక్టు ఎలా అయినా రూపుదిద్దుకోవచ్చని తెలిపారు . కార్తికేయ 2 సినిమా సక్సెస్ తర్వాత ఈయనపై అంచనాలు మరి ఎక్కువగా పెరిగిపోయాయి. దర్శకుడు చందు మొండేటి దానికి సంబంధించిన స్క్రిప్టును కూడా ఇప్పుడు మరింత ఉన్నత స్థాయిలో తీసుకురావాలని ఆలోచిస్తున్నారు.

చందు మొండేటికి ఇప్పుడు గీత ఆర్ట్స్ లోనే ఒక సినిమా చేయాల్సిన కమిట్మెంట్ ఉందని.. దాని తర్వాతే కార్తికేయ 3 సినిమా గురించి ఆలోచిస్తారు అన్నట్లుగా తెలుస్తోంది. కుదిరితే వచ్చే ఏడాది చివరిలో కార్తికేయ 3 మొదలు కావచ్చు అని నిఖిల్ తెలిపాడు. అయితే ఈ సినిమా మల్టీ స్టారర్ మూవీ కావచ్చు అని.. మరొక హీరో ఎవరైనా రావచ్చు అని కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఎవరా స్టార్ హీరో అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు.

Read more RELATED
Recommended to you

Latest news