విత్తన శుద్ధి చెయ్యడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

-

పంటలు వేసిన తర్వాత మాత్రమే కాదు..నేలలో కూడా ఎన్నో క్రిములు, సిలింద్రాలు కూడా ఉంటాయి.అందుకే ఎటువంటి క్రిములు లేకుండా రాకుండా పురుగు మందు లేదంటే తెగులు మందును పొడిరూపంలో గాని, ద్రవ రూపంలో గాని విత్తనానికి పట్టించే విధానాన్ని విత్తనశుద్ధి అంటారు.కేవలం మందులు మాత్రమే వాడటం మాత్రమే కాదు..వేడి నీటిలో ఉంచడం,లేదా ఎండలో ఉంచడం చేసిన అది విత్తన శుద్ధి అవుతుంది.. అసలు విత్తన శుద్ధి చెయ్యడం చాలా ముఖ్యం..ఈ విషయాన్ని రైతులు గుర్తు పెట్టుకోవడం మంచిది..

*. విత్తన శుద్ధి చెయ్యడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..

*. మొలకెత్తే విత్తనాలను, లేత మొక్కలను విత్తనము ద్వారా లేదా నేల ద్వారా సంక్రమించే శిలీంధ్రాల నుండి కాపాడుకోవచ్చు.
*. పప్పజాతి పంట మొక్కల వేర్లపై బుడిపెల సంఖ్య పెరుగుతుంది..దిగుబడి కూడా పెరుగుతుంది..
*. తక్కువ ఖర్చుతో, తెగుళ్ళు, పురుగులను అదుపులో ఉంచవచ్చు.
*. విత్తనశుద్ధి చేసినపుడు, నిల్వ చేసినపుడు ఆశించే పురుగుల నుండి కూడా రక్షణ పొందవచ్చు.
*. ముఖ్యంగా నేలద్వారా సంక్రమించే తెగుళ్ళను, పురుగు లను సమర్థవంతంగా నివారించవచ్చు..
*. విత్తన పై భాగంలో ఆశించిన శిలీంధ్ర బీజాలను నిర్మూలించడానికి విత్తనశుద్ధి మందును, విత్తనంపై, పొడి రూపంలో గాని, లేదా ద్రవ రూపంలో కాని పట్టించినప్పుడు పై పొరల్లో ఉన్న శిలీంధ్రాలు నిర్మూలించబడతాయి.
*. విత్తనాలు/మొలకెత్తిన లేత మొక్కలు నేలలో ఉన్న శిలీంధ్రముల నుండి రక్షణ పొందుతాయి.
*. విత్తనం లోపల ఆశించిన శిలీంధ్ర బీజాలను నిర్మూలించడానికి విత్తనశుద్ధికి ఉపయోగించే వుందు, విత్తనం లోపలి భాగంలోకి చొచ్చుకొనిపోయి శిలీంధ్రాలు నిర్మూలించ బడుతాయి..ఇలా విత్తన శుద్ధి చెయ్యడం వల్ల ఛీడపీడల ప్రభావం కూడా ఉండదని నిపుణులు అంటున్నారు..విత్తన శుద్ధిలో ఇంకేదైనా సమస్యలు ఉంటే వ్యవసాయ నిపుణులను అడగటం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news