వాస్తు: కొత్త ఏడాది అనందం ఉండాలంటే.. ఈ పూలని, మొక్కలని ఉంచడం మంచిది..!

-

ఇక ఈ నెలతో ఈ సంవత్సరం పూర్తయిపోతుంది. కొత్త సంవత్సరం రాబోతోంది. చాలా మంది కొత్త సంవత్సరం బాగుండాలని… కొత్త సంవత్సరంలో ఆనందంగా ఉండాలని భావిస్తూ ఉంటారు మీరు కూడా కొత్త సంవత్సరం మీ ఇంట ఆనందాలు ఉండాలని కోరుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలని అనుసరించండి. వీటిని అనుసరించడం వలన ఏ బాధ రాదు. పండితులు మనతో కొత్త సంవత్సరం లో ఆనందం ఉండాలంటే ఏం చేయాలి అనేది చెప్పారు. మరి ఇక వాటి కోసం చూసేద్దాం. కొత్త సంవత్సరం ఆనందంగా ఉండాలంటే కచ్చితంగా ఈ పూలను.. ఈ పూల మొక్కల్ని ఉంచండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

 

తులసి మొక్క:

తులసి మొక్క ఇంట్లో ఉండడం చాలా ముఖ్యం లక్ష్మీదేవి తులసి మొక్క వున్న చోట వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది.

జేడ్ మొక్క:

ఈ మొక్క కూడా ఇంట్లో ఉంచడం మంచిది దీని వలన పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది ఈ మొక్క ఇంట్లో ఉంటే అనందం అదృష్టం రెండు ఉంటాయి.

వెదురు మొక్క:

చాలా మంది వెదురు మొక్కని ఆఫీస్ టేబుల్స్ మీద పెట్టుకుంటూ ఉంటారు నిజానికి ఈ మొక్క ఉండటం వలన ధనం పెరుగుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది.

బంతి, గులాబీ మొక్కలు:

ఇంట్లో బంతి మొక్కలు గులాబీ మొక్కలు ఉండే చాలా మంచిది వీటిని ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పైగా ఈ పూలను పూజకి కూడా వాడొచ్చు. ఇవి నెగటివ్ ఎనర్జీ ని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. పైగా పూలు ఉన్న చోట ప్రశాంతంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news