DH శ్రీనివాసరావు వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్

-

ఏసుక్రీస్తు దయవల్లే దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస రావు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీనివాసరావు ఓ మతానికి కొమ్ముకాస్తున్నారని.. ఓ మతానికి చెందిన దేవుడే కాపాడతాడా? అని ప్రశ్నించారు.

డిహెచ్ శ్రీనివాసరావు అవినీతిని త్వరలోనే బయటపెడతామన్నారు అండి సంజయ్. ఎమ్మెల్యే టికెట్ కోసమే శ్రీనివాసరావు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అయితే శ్రీనివాసరావు మాత్రం తన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. అన్ని మతాలను ఒకేలా చూస్తానన్న డిహెచ్ ఎవరి నమ్మకాలను కించపరచని అన్నారు. దయచేసి యూట్యూబ్ లో ఉన్న పూర్తి వీడియోని చూడాలన్నారు డిహెచ్ శ్రీనివాస్.

Read more RELATED
Recommended to you

Latest news