సీనియర్ హీరోలతో నటించడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీ లీలా..?

-

తాజాగా తెలుగులో భారీగా వినిపిస్తున్న పేరు హీరోయిన్ శ్రీ లీల.. ఎందుకంటే ఇటీవల మాస్ మహారాజా ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమె తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అందరితోను ఇంటరాక్ట్ అవుతూ.. చలాకీగా ఉంటూ రిలీజ్ కి ముందే యూత్ మనసులు దోచుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా వచ్చే యేడాది వరుస పెట్టి విడుదల కాబోతున్నాయి. ఇందులో ఏ కొన్ని హిట్ అయినా సరే ఈమె స్టార్ హీరోయిన్ అయిపోవడం గ్యారెంటీ. ఇప్పుడు వయసుకు తగ్గట్టుగా ఉన్న యంగ్ హీరోలతో నటించడమే కాకుండా తనకంటే వయసులో పెద్ద వారైనా స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ విషయంపై తాజాగా షాకింగ్ కామెంట్లు చేసింది.

తాజాగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈమె మాస్ మహారాజా పై చేసిన కామెంట్లు అభిమానులకు ఫుల్ ఆనందాన్ని ఇస్తున్నాయి. అదే సమయంలో శ్రీలీల చేసిన మిగతా కామెంట్స్ కూడా కాస్త చర్చనీయాంశంగా మారాయి అని చెప్పాలి. శ్రీ లీల ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ..” రవితేజతో నటించడం చాలా సంతోషంగా ఉంది . ఆయన ఎనర్జీ మ్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు..” అని తెలిపింది.. రవితేజ లాంటి సీనియర్ హీరోలతో నటించడం ఏజ్ గ్యాప్ గురించి శ్రీ లీలాను అడగ్గా.. ఆమె మాట్లాడుతూ..” నాకన్నా ముందే స్టార్ హీరోయిన్లే తమకన్నా ఎక్కువ వయసున్న హీరోలతో కలిసి నటించారు. వారు ఏజ్ గురించి పట్టించుకోలేదు.. ఇక నేనెంతో చెప్పండి..” అంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

శ్రీ లీల ఈ విషయం నార్మల్ గా చెప్పినప్పటికీ అడిగిన వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ లు అనిపించొచ్చు. ఇదిలా ఉండగా నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న అనగనగా ఒక రాజు.. కన్నడ , తెలుగు ద్వి భాషా చిత్రం జూనియర్ లో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ధమాకా సినిమాతో తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news