రవితేజ హీరోగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించిన చిత్రం ధమాకా,నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ విడుదల అయిన తర్వాత మంచి వసూళ్లు సాధిస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.
ఇక మూడవరోజు ఇతర రాష్ట్రాల సహా మిగతా భారతదేశం అంతా కలిపి కోటి పది లక్షల వసూలు చేస్తే ఓవర్సీస్ లో 90 లక్షల వసూలు చేసింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజుల్లో 15 కోట్ల 37 లక్షల షేర్ 27 కోట్ల 30 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 18 కోట్ల 30 లక్షలు చేసింది.
ఈ సినిమా 19 కోట్లు వసూళ్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ గా నిర్ణయించారు. ఇంకా మూడు కోట్ల అరవై మూడు లక్షలు వసూలు చేస్తే ఈ సినిమ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఇక సోమవారం కూడా బాక్సింగ్ డే సందర్భంగా సెలవు దినం కావడంతో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని రవితేజ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.