రాజన్నసిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల ఫలితాలతో బిజెపిని మరోసారి ప్రజలు తిరస్కరించారని కేటీఆర్ చురకలు అంటించారు. అడ్డదారుల్లో గెలుపు కోసం బిజెపి చేసిన కుటిలప్రయత్నాలు అన్నింటిని ప్రజలు ఓటుతో వమ్ము చేశారని ఫైర్ అయ్యారు. సెస్ ఎన్నికలను సాధారణ ఎన్నికల మాదిరి మార్చి, విచ్చలవిడి డబ్బులతో, ప్రలోభాలతో ప్రజలను మభ్య పెట్టాలనుకున్న బిజెపి ప్రయతాలు విఫలం అయ్యాయని మండిపడ్డారు.
తెలంగాణలో బిజెపికి స్థానం లేదని మరోసారి ప్రజలు తేల్చి చెప్పారు..సెస్ ఎన్నికల బిజెపి ఓటమి, తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి పట్ల నెలకొని ఉన్న తీవ్రమైన వ్యతిరేకతకు, తిరస్కారభావానికి నిదర్శనమన్నారు కేటీఆర్. సెస్ ఎన్నికల్లో విజయానికి కృషిచేసిన పార్టీ శ్రేణులకు నాయకులకు ధన్యవాదాలు…తెలిపారు. ఈ విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు కేటీఆర్.