వైసీపీ ప్రభుత్వం పై సొంత పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం రావూరులో వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్ లో సమావేశంలో ఆనం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంతలు పూడ్చలేకపోతున్నామని, తాగేందుకు నీళ్లు లేవు అని ప్రజలు చెబితే.. కేంద్రం నిధులు ఇచ్చాక అప్పుడు నీళ్లు ఇస్తామని చెప్పుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే మీరేం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. ఈ నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేశామని వచ్చే ఎన్నికలలో ఓట్లు అడగాలి అన్నారు. ప్రాజెక్టులు కట్టామా?, ఏ పనైనా మొదలు పెట్టామా? అని ప్రశ్నించారు. సొంత పార్టీ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయడంతో ఏపీ రాజకీయాలలో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది.