టెన్త్ విద్యార్థులకు శుభవార్త..!

-

పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ సంవత్సరం నుండి బోర్డు పరీక్షలు కేవలం ఆరు పేపర్లతోనే ఉంటాయట. పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను తీసుకు వచ్చారు. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేది నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారట.

ఈ విషయాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను రిలీజ్ చెయ్యాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకులకి చెప్పారు. టెన్త్ పరీక్షలు ఆరు పేపర్లతోనే నిర్వహిస్తారని చెప్పారు మంత్రి. ప్రతీ పరీక్షకు మూడు గంటల సమయాన్ని కేటాయిస్తున్నట్టు అన్నారు. వంద శాతం సిలబస్‌తో పరీక్షలను నిర్వహించాలని అన్నారు. అయితే బోర్డు పరీక్షల్లో మాత్రం ఆరు పేపర్లే వుంటాయని అన్నారు. అలానే వ్యాస రూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్ వుంటుందట.

మార్కులకు సంబంధించి వివరాలు

 

సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్ ఉండదు. అలానే నమూనా ప్రశ్నా పత్రాలను వెంటనే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకు రావాలని అన్నారు. ఇదిలా ఉంటే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉత్తీర్ణత శాతం ప్రభుత్వ పాఠశాలల్లో రావాలని మంత్రి అన్నారు. సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులను నిర్వహించాలని సూచించారు. అలానే వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక బోధన చేయాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news