సూర్య సెంచరీ.. రికార్డులన్నీ బద్దలు! టీ20 చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా..!

-

రెండో టీ20 లో 16 పరుగుల తేడాతో పోరాడి ఓడిన టీమిండియా, మూడో టి20 లో ఘనవిజయం అందుకుంది. 229 పరుగుల భారీ టార్గెట్ తో బరిలో దిగిన శ్రీలంక, 16.4 ఓవర్లలో 137 పరుగులకి ఆల్ అవుట్ అయ్యింది. కుషాల్ మెండీస్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో 4.4 ఓవర్లలో 44 పరుగులు చేసింది శ్రీలంక.

ఇక ఇండియన్‌ బౌలర్లు విజృంభించడంతో.. టీమిండియా 91 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా బ్యాటింగ్ చేశాడు. 51 మంత్రులు 112 పరుగులు చేసి, నాట్ అవుట్ గా నిలిచాడు సూర్య. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ టి20 లలో మూడు సెంచరీలు చేసిన తొలి నాన్ ఓపెనర్ గా సూర్య చరిత్ర సృష్టించాడు. టీ20 లో అత్యధిక సంఖ్యలో బాడిన జాబితాలో సూర్య రెండో స్థానంలో నిలిచాడు. నాలుగు సెంచరీలతో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా మూడు సెంచరీలతో సూర్య రెండో స్థానంలో నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news