ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ పోస్టులు.. ఇలా అప్లై చేసేయండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

వైఎస్సార్‌ జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వైఎస్సార్‌ జిల్లా లోని వివిధ ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో అంగన్‌వాడీ పోస్టులు ఖాళీగా వున్నాయి. మొత్తం దీనిలో 148 పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇక ఖాళీల వివరాలని చూస్తే… అంగన్వాడీ వర్కర్‌ 37, అంగన్వాడీ హెల్పర్‌ 108, అంగన్వాడీ మిని వర్కర్‌ 03 వున్నాయి.

ఇక ఎవరు ఈ పోస్టులకి అర్హులు అనేది చూస్తే.. అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు అప్లై చేసుకోవడానికి టెన్త్ ప్యాస్ అయ్యి ఉండాలి. అంగన్‌వాడీ హెల్పర్, అంగన్‌వాడీ మినీ వర్కర్ పోస్టులకు అయితే సెవెంత్ ప్యాస్ అయ్యి ఉండాలి ఇక వయస్సు విషయానికి వస్తే.. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునే వారి వయసు 01-07-2023 నాటికి 21 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేయడానికి 11-01-2023 చివరి తేదీ. డీఆర్‌డీవో కార్యాలయాల్లో 12-01-2023 తేదీన ఇంటర్వ్యూలు ఉంటాయి. దరఖాస్తలను సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో వాటిని తిరిగి ఇచ్చేయాల్సి వుంది. https://srisathyasai.ap.gov.in/ లో పూర్తి వివరాలను చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news