బీజేపీకి కొత్త అధ్యక్షుడు..టార్గెట్ బండి.!

-

తెలంగాణలో బీజేపీ దూకుడుగా రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంది. ఇక తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడుగా బండిస్ సంజయ్ వచ్చిన దగ్గర నుంచి మరింత దూకుడుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. బండి దూకుడుతో పార్టీకి ఊపు వచ్చింది. అయితే ఈ ఏడాదిలో బండి పదవీకాలం ముగుస్తుంది. ప్రతి మూడు ఏళ్ళకు బీజేపీ అధ్యక్షులని నియమిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సారి బండి సంజయ్‌ని అధ్యక్షుడుగానే కొనసాగించాలని బీజేపీ అధిష్టానం ప్లాన్ చేసుకుంది. బండి అధ్యక్షతన ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేశారు. కానీ ఈ అంశంపై వేరే ప్రచారం జరుగుతుంది. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రానున్నారని ప్రచారం వస్తుంది. బండిని మార్చేసి కొత్త అధ్యక్షుడుని నియమిస్తారని అంటున్నారు. ఇక ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు..బండిని అధ్యక్షుడుగా కొనసాగించనున్నారు. కానీ ప్రత్యర్ధి పార్టీలే అధ్యక్షుడుని మారుస్తున్నారని చెప్పి బీజేపీలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.

ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..అధ్యక్షుడు మార్పుపై తేల్చి చెప్పేశారు..బండిని మార్చే ప్రసక్తి లేదని, ఇప్పుడున్న టీంతోనే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. అటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సైతం అధ్యక్షుడుని మార్చే ఛాన్స్ లేదని చెప్పేశారు. అయినా సరే ఏదో రకంగా అధ్యక్షుడి మార్పూపై ప్రచారం వస్తుంది. ఈ క్రమంలోనే దీనిపై విజయశాంతి ఘాటుగా స్పందించారు.

ఈ అంశంపై కొందరు వ్యతిరేకులు లేనిపోని ప్రచారాన్ని చేస్తున్నారని, ఈ అంశంపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం స్పష్టతనిచ్చారని, తెలంగాణ బీజేపీ నాయకత్వంలో మార్పు ఉండదని చెప్పారు. అరకొర సమాచారాన్ని నమ్మి చిలవలు పలవలు చేసి ప్రచారం చేసేవారికి ఇంతకు మించి చెప్పాల్సిందేమీ లేదంటూ విజయశాంతి చెప్పుకొచ్చారు. మొత్తానికి బండిని మార్చే విషయంలో ప్రత్యర్ధులు ఫేక్ ప్రచారం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news