బ్రెజిల్‌లో విధ్వంసం వేళ.. మాజీ అధ్య‌క్షుడు బోల్సోనారోకు అస్వస్థత

-

బ్రెజిల్‌లో ఓ వైపు విధ్వంసం రగులుతున్న వేళ ఆ దేశ మాజీ అధ్య‌క్షుడు జైర్ బోల్సోనారో ఆస్ప‌త్రి పాల‌య్యారు. క‌డుపు నొప్పితో బాధ‌ప‌డుతున్న జైర్‌ను ఆస్ప‌త్రిలో చేర్పించిన‌ట్లు ఆయ‌న భార్య మిచ్చెల్లె బోల్సోనారో వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం జైర్ ఫ్లోరిడాలోని అడ్వెంట్ హెల్త్ సెల‌బ్రేష‌న్ అక్యూట్ కేర్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న‌ట్లు బ్రెజిల్ న్యూస్ పేప‌ర్ ఓ గ్లోబో తెలిపింది.

జైర్‌పై 2018లో జ‌రిగిన క‌త్తి దాడి వ‌ల్ల మ‌ళ్లీ అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు ఆయ‌న భార్య పేర్కొంది. ప్రస్తుతం జైర్ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నారు. బ్రెజిల్ అధ్య‌క్షుడిగా త‌న ప‌ద‌వీకాలం ముగిసే కంటే రెండు రోజుల ముందు(డిసెంబ‌ర్ 31) జైర్ అమెరికాకు వెళ్లారు.

మరోవైపు బోల్సొనారో మద్దతుదారులు బ్రెజిల్‌లో పలుచోట్ల విధ్వంసం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ నేత బోల్సొనారో ఓటమిని జీర్ణించుకోలేని వేలాదిమంది ఒక్కసారిగా దేశంలోని అతి ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలైన అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు, కాంగ్రెస్‌ భవనాలలోకి చొరబడ్డారు. సెక్యూరిటీ వలయాలను ఛేదించి, బారికేడ్లను తొలగించిన ఆందోళనకారులు పెద్దయెత్తున ఈ భవనాల్లోకి ప్రవేశించారు. వీరిని అడ్డుకోవడం అక్కడి అధికారులకు పెను సవాలుగా మారింది. ఎట్టకేలకు ఆ దేశంలో అల్లర్లు చల్లారాయి.

Read more RELATED
Recommended to you

Latest news