నా పరిస్థితి ఎవరికీ రాకూడదు : సమంత

-

బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఫిల్మ్ ‘శాకుంతలం’. ప్రకృతి ప్రియం ‘శాకుంతలం’ సినిమాపైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. టైటిల్ రోల్ ‘శకుంతల’ను సమంత ప్లే చేస్తుండగా, దుష్యంతుడిగా మలయాళ యంగ్ హీరో దేవ్ మోహన్ నటించారు. ఈ పిక్చర్ ద్వారా ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తనయ అర్హ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నది.

ఇది ఇలా ఉండగా, శాకుంతల ఈవెంట్ లో సమంతను చూశాక మరోసారి ఆమె ఆరోగ్యం పై చర్చ మొదలైంది. ‘విడాకుల తర్వాత ధైర్యంగా నిలదొక్కుకుంటున్న టైములో సమంతకు మయోసైటీస్ రావడంతో చాలా వీక్ అయింది. అందం తగ్గిపోయింది. ఆమెను చూస్తే బాధేస్తోంది’ అని BuzZBasket పేజీ ట్వీట్ చేసింది. ‘నాలాగా నెలల తరబడి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి ఎవరికి రాకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నా. నువ్వు బాగుండాలని కోరుకుంటున్నా’ అని సామ్ రిప్లై ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news