క్రెడిట్ స్కోర్ ఎంత ముఖ్యమనేది చెప్పక్కర్లేదు. క్రెడిట్ స్కోర్ ఎంత ముఖ్యమో మనకి తెలుసు. లోన్ తీసుకోవాలన్నా కూడా క్రెడిట్ స్కోర్ చూస్తారు. పర్సనల్ లోన్స్ పొందడంతో పాటు వడ్డీ రేట్లలో డిస్కౌంట్ పొందాలంటే క్రెడిట్ స్కోర్ అవసరం. అందుకే దీన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అవసరం. క్రెడిట్ స్కోర్ ని పెంచేందుకు ఈ జాగ్రత్తలు పక్కాగా తీసుకోండి.
ఈ స్కోర్ చెక్ చేయడం ఏజీఎం ఎక్కువ టైం ఏమి పట్టదు. క్రెడిట్ స్కోర్ ని వాట్సాప్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. డేటా అనలిటిక్స్ అండ్ డెసిషన్ ఆర్గనైజేషన్ ఎక్స్‌పీరియన్ ఇండియా వాట్సాప్ లోనే ఫ్రీగా క్రెడిట్ స్కోర్ రిపోర్ట్స్‌ను ఆఫర్ చేయడం మొదలు పెట్టింది. దీనితో ఈజీగా మీరు క్రెడిట్ స్కోర్ రిపోర్టు పొందొచ్చు. మరి అది ఎలానో చూసేద్దాం.
ఎక్స్‌పీరియన్ ఇండియా వాట్సాప్ నంబర్ +91-9920035444 ని ఫోన్ లో సేవ్ చేసి ఉంచండి.
వాట్సాప్ లో ‘Hi’ అని మెసేజ్ పంపాలి.
పేరు, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ వంటి వివరాలని ఇచ్చేయండి.
ఇలా మీరు క్రెడిట్ స్కోర్‌ను పొందొచ్చు.రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడీకి పాస్‌వర్డ్-ప్రొటెక్షన్‌తో ఎక్స్‌పీరియన్ క్రెడిట్ రిపోర్ట్ రిక్వెస్ట్ చెయ్యాలి. ఈజీగా సురక్షితంగా మీరు క్రెడిట్ రిపోర్ట్ పొందొచ్చు