చిన్నప్పుడు మీరు ఇలా ఆలోచించారా..చెక్ చేసుకోండి…!!!

-

బాల్యాన్ని ఒక్కసారి నెమరు వేసుకుంటే మళ్ళీ వెనక్కి రావాలని అనిపించదు. గతంలోకి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది. బాల్యంలో చేసిన చిలిపి చేష్టలు, అల్లర్లు, కోపాలు, అలగడాలు అబ్బో ఒకటా రెండా మన సామ్ర్యాజ్యంలో మనమే హీరో. అయితే ఆ సమయలో మనకి ఎన్నో సందేహాలు, ఎన్నో ఆలోచనలు, మరెన్నో ప్రశ్నలు గంపగుత్తంగా బుర్రలో ఉంటాయి.

ఆ సమయంలో వాటిని నివృత్తి చేసుకోవడానికి తల్లి తండ్రులని మనం అడిగిన ప్రశ్నలు, వారు సమాధానం చెప్పలేనివిగా, ఒక్కో సారి వాళ్ళే ఆశ్చర్యపోయేవిగా ఉంటాయి. అంతేకాదు చుట్టాలు అందరూ ఉన్న సమయంలో చిన్న పిల్లలు  సంధించే ప్రశ్నలు పరువు తీసేసేలా ఉంటాయి. మనలో ఆప్పటి ప్రశ్నలు గుర్తు ఉన్నాయో లేదో కానీ ఆ చిత్ర విచిత్రమైన ప్రశ్నలు ఒక్క సారి గుర్తు చేసుకుందాం..

–      గడియారంలో ముల్లు అలాగే ఎందుకు తిరుగుతుంది.

–      జంతువులు పక్షులు మాట్లాడతాయా

–      నాన్న నేను నీలా ఎందుకు పెద్దగా లేను,నాకు నీకున్న మీసం రాదా

–      ఆ పక్షిలా మనం ఎందుకు ఎగరలేము

–      నేను ఎలా పుట్టాను

–      అబద్దం ఆడకూడదు అన్నారు కదా మరి నువ్వు ఎందుకు అబద్దం ఆడుతున్నావు అమ్మ

–      నాన్నా,  విమానంలో బాత్ రూమ్ కి వెళ్తే కింద పడిపోతుందా

–      చుట్టాల మధ్య ఉన్నప్పుడు – రాత్రి మా నాన్న మా అమ్మకి ముద్దు పెట్టాడు రోజూ పెడుతాడు  అంటూ చెప్పగానే ఆ పరిస్థితి చూడాలి. ఇలాంటి సందర్భం చాలా మంది ఎదుర్కునే ఉంటారు.

–      కుక్కని పెంచుకుంటాము,మరి పందిని ఎందుకు పెంచుకోము.

–      ఈ మావయ్యనేగా నువ్వు తిట్టింది.

–      ఆకలి ఎక్కడ పుడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news