హబ్సిగూడలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి వ్యక్తులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతాప్ అనే వ్యక్తి మొదట తల్లి, భార్య, కూతురికి ఉరివేసి అనంతరం ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. సింధూర (32) హిమాయత్ నగర్ లోని ఒక ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్ గా విధులు నిర్వహిస్తుంది. ప్రతాప్ (34) బిఎండబ్ల్యూ కార్ షోరూమ్ లో డిజైనర్ మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
కూతురు ఆధ్యా (4), ప్రతాప్ తల్లి రాజాతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని స్థానికులు పేర్కొన్నారు.