ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర శిక్షా అభియాన్‌ విజయవాడ లోని రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫీస్‌లో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 60 పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఖాళీగా వున్నాయి.

ఇక ఎవరు అర్హులు అన్నది చూస్తే.. పదో తరగతి, బ్యాచిలర్ డిగ్రీ లేదా ఎంఎస్ ఆఫీస్/పీజీడీసీఏ/డీసీఏ/ఇంజినీరింగ్ సర్టిఫికెట్/కంప్యూటర్‌తో ఏదైనా డిగ్రీ ని పూర్తి చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ స్కిల్స్‌ కచ్చితంగా ఉండాలి. అలానే తెలుగు, ఇంగ్లిషు భాషలు చదవడం, రాయడం కూడా వచ్చి ఉండాలి.

ఇక వయస్సు విషయానికి వస్తే.. నవంబర్‌ 30, 2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల సడలింపు కూడా వుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునేవాళ్లు ఆన్ లైన్ పద్దతి లో అప్లై చేసుకోవచ్చు. జనవరి 31, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవడానికి సమయం వుంది. స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలను https://apssa.aptonline.in/# లో చూసి అప్లై చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news