భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ చిచ్చు రగులుకుంది. ఎమ్మెల్యే వనమా అధ్యక్షతన ఆయన నివాసంలో జరుగుతున్న ఆవిర్భావ సన్నాహక సమావేశానికి కొత్తగూడెం బీఆర్ఎస్ ముఖ్యనేతలు సహా పన్నెండు మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే వనమావెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కాపుసీతాలక్ష్మి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ సమావేశానికి వారు దూరంగా ఉన్నట్లు సమాచారం.
ఇటీవల సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలో ఎమ్మెల్యే వనమా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగాకాంతారావ్ మధ్య వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఎంపీ నామానాగేశ్వరరావు, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ.