తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. ధాన్యం కొనుగోళ్లపై తాజాగా కీలక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు వెల్లడించారు మంత్రి గంగుల కమలాకర్. సీఎం కేసీఆర్ దార్శనిక విధానాలతో తెలంగాణ రాష్ట్రంలో పంటల విప్లవం పుట్టుకొచ్చిందని వివరించారు.
7024 కొనుగోలు కేంద్రాల ద్వారా 13,750 కోట్ల విలువ గల 64.30 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ చేశామని తెలిపారు. 9 లక్షల 76 వేల మంది రైతులు తమ ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు విక్రయించుకోగలిగారని వివరించారు. వానా కాలం లేటుగా నాట్లేసిన కారణంగా… ధాన్యం అమ్ముకోవడానికి ఈ నెల 24 వ తేదీ వరకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. చివరి గింజా వరకు కొనుగోళ్లు చేస్తామన్నారు మంత్రి గంగుల.