ఎన్టీఆర్ కి ఆస్కార్ వస్తే.. ఇండియన్ సినిమాలో మార్పులు తప్పవా..?

-

ఆర్ ఆర్ ఆర్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతున్న పేరు. ఈసారి ఎలాగైనా సరే హాలీవుడ్ గోడలను బద్దలు కొడుతూ ఆస్కార్ అవార్డును అందుకోవాలని చూస్తోంది. ఇప్పటికే నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. అందుకే ఈసారి కచ్చితంగా ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ రావడం పక్కా అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీలో ఆర్ఆర్ఆర్ దేశం నుంచి చోటు దక్కించుకోలేకపోవడంతో డైరెక్టర్ రాజమౌళి నిరాశ చెందాడు. కానీ జనవరి 25న ప్రకటించే అఫీషియల్ ఆస్కార్ ఎంట్రీ లిస్టులో ఆర్ ఆర్ ఆర్ చోటు దక్కించుకుంటుందా లేదా అనేది చూడాలి.

ఇకపోతే ఈ సినిమాలో కొమరం భీమ్ గా తన అద్భుతమైన నటనతో హాలీవుడ్ నటుల, రచయితల ప్రశంసలు పొందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈసారి యాక్టింగ్ విభాగంలో ఆస్కార్ వస్తుందని అందరూ భావిస్తున్నారు. అంతేకాదు ఇటీవల రిలీజ్ చేసిన టాప్ టెన్ లిస్ట్ లో కూడా మొదటి స్థానంలో ఎన్టీఆర్ పేరు చోటుచేసుకుంది మరి ఎన్టీఆర్కు ఆస్కార్ వస్తే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఏం మార్పులు జరగబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. గతంలో భారతదేశ చిత్ర పరిశ్రమ అంటే కపూర్లు , ఖాన్లు అని చెప్పుకునేవారు . అయితే ఇప్పుడు బాలీవుడ్ హీరోల కంటే టాలీవుడ్ హీరోలే ఎక్కువ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నప్పటికీ వారిని తక్కువ చేసి చూసేవారు.. మరీ ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమను చాలా కిందిస్థాయిలో లెక్క కట్టేవారు బాలీవుడ్ వాసులు.

ఇలాంటి టైంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఆస్కార్ వస్తే ఈ విమర్శలు అన్నిటికీ ఏకైక సమాధానంగా నిలుస్తాడు ఎన్టీఆర్ . ఆస్కార్ గెలిచే సినిమాలు ఇలాగే ఉండాలి అనే ఒక పద్ధతికి చరమగీతం పాడినట్లు అవుతుంది. కమర్షియల్ కథలతో కూడా ఆస్కార్ గెలపొందొచ్చు అనే ట్రెండ్ సెట్టర్ను క్రియేట్ చేస్తుంది ఆర్ఆర్ఆర్. సౌత్ సినిమాలను చిన్నచూపు చూస్తున్న నార్త్ ఇండస్ట్రీకి ఇది గుణపాఠం లాంటిది అని చెప్పవచ్చు అందుకే ఒక్క అవార్డుతో ఇన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అంటే దానికి మించిన అవార్డు ఇంకోటి ఉండదేమో. మరి అనుకున్నట్టుగా ఎన్టీఆర్కు ఆస్కార్ అవార్డు లభిస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news