హైకోర్టులో బాంబు కలకలం.. రంగంలోకి బాంబ్​ స్క్వాడ్

-

పంజాబ్​-హరియాణా హైకోర్టు, చండీగఢ్​ జిల్లా కోర్టు, పంచకూల కోర్టుల్లో బాంబులు కలకలం రేపాయి. ఈ కోర్టుల్లో బాంబులు ఉన్నాయంటూ వచ్చిన లేఖలు స్థానికంగా హంగామా సృష్టించాయి. కోర్టుల్ని పేల్చేస్తామని ఆ లేఖలో రాసి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. న్యాయమూర్తి కాంప్లెక్స్​లో బాంబు పెట్టామని.. అది మధ్యాహ్నం ఒంటి గంటకు పేలుతుందని చెప్పారు. బాంబు సమాచారం అందుకున్న పంచకూల పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు డిస్పోజల్​ స్క్వాడ్​, డాగ్​ స్క్వాడ్​ ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

అనంతరం కోర్టు పరిసరాల్లో ఉన్నవారందరినీ బయటకు పంపించి.. తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. కాగా, బాంబు బెదిరింపు లేఖ తమకు వచ్చిందని ఏసీపీ సురేంద్ర యాదవ్ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Bomb threat to Punjab and Haryana High Court

బాంబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఈ ఘటన జరగడం భయాందోళనలకు గురిచేస్తోంది. మొదట మాక్​ డ్రిల్స్​ అని చెప్పిన పోలీసులు.. తర్వాత బాంబు బెదిరింపు లేఖ వచ్చినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news