2023 – 24 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో అన్ని రంగాల వారికి చేయూతనిస్తామన్నారు నిర్మల సీతారామన్. రైతులకు 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వ్యవసాయంతో పాటు డైరీ, మత్స్య శాఖలను కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పీఎం మత్స్య సంపద యోజన కోసం అదనంగా 6 వేల కోట్లను కేటాయిస్తున్నామన్నారు.
అలాగే రైతుల ఉత్పత్తుల నిల్వ కోసం గిడ్డంగులు నిర్మిస్తామన్నారు. 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు రైతులకు అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే దేశంలోని 50 విమానాశ్రయాలు, పోర్టుల అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. రైల్వేకు 2.40 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పీఎం ఆవాస్ యోజనకు 79 వేల కోట్ల కేటాయింపు, కరువు ప్రాంత రైతులకు 5.300 కోట్ల కేటాయింపు, క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంకు 2 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.