రుచిక‌ర‌మైన `చికెన్‌ ఫ్రై మసాలా` ట్రై చేయండిలా..

-

కావాల్సిన పదార్థాలు:
చికెన్ – 1 కేజీ
పసుపు – 1 స్పూన్‌
నూనె – సరిపడా
పచ్చిమిర్చి – 4
కారం – 2 స్పూన్లు


నీళ్లు – స‌రిప‌డా
అల్లం వెల్లుల్లి – 2 స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
ఉల్లిపాయలు – రెండు
గరం మసాలా – 1 స్పూన్‌

తయారీ విధానం:
ముందుగా కడాయిలో చికెన్‌ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్ళు వేసి 15 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్‌ చేసి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్‌ తీసుకొని అందులో నూనె కొద్దిగా వేసి వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి.

పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత ఉడికించిన చికెన్‌, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కారం వేసి పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. తర్వాత గరం మసాలా వేసి కలపి రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్‌ చేసేయాలి. అంతే ఎంతో రుచిక‌ర‌మైన చికెన్ ఫ్రై మ‌సాలా రెడీ..!

Read more RELATED
Recommended to you

Latest news