రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా..? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు.. ప్రభుత్వం డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. రైతు యాచించాలని ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రైతు భరోసా కింద ఇవ్వలేదన్నారు.
రైతు ప్రమాణ పత్రం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. రైతు బంధు పథకాన్ని బొందపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఎగ్గొట్టింది దాదాపు రూ.26,500 కోట్లు. ఊరూరా నోటీసులు ేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 12 సార్లు రైతుబంధు ఇచ్చాం కదా.. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం ఒక్కసారి మాత్రమే రైతుబంధు నిధులను ఇచ్చారు. అది కూడా మేము అధికారం కోల్పోయిన తరువాత.. మూడు నెలల తరువాత మేము పెట్టిన డబ్బులను ఆ ఖాతాల్లో వేశారని తెలిపారు. రైతుబంధు పక్కదారి పట్టిందని దుష్ప్రచారం చేస్తున్నారు.