గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో అనితర సాధ్యమైన ఫీట్లను మాత్రమే రికార్డు చేస్తారన్న విషయం తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కోలా ఇతరులు చేయలేదని సాధించి తమ పేరు మీద కొత్త చరిత్రను లిఖించుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి నాలుకతో స్పీడుగా తిరుగుతున్న ఫ్యాన్ రెక్కలను ఆపి కొత్త రికార్డును సృష్టించాడు.
క్రాంతి డ్రిల్మాన్ అనే ఓ యువకుడు నాలుకతో ఎలక్ట్రిక్ ఫ్యాన్ రెక్కలను ఆపి రికార్డు సృష్టించారు. నిమిషంలో 57 ఫ్యాన్ రెక్కలను నాలుకతో ఆపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చూసేందుకు సింపుల్‌గా అనిపించినా అది అంత సులవైన పనికాదు. ఫ్యాన్ రెక్కలు స్పీడుగా తిరిగే సమయంలో ఒక్కోసారి నాలుగ తెగిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ, కఠోరమైన శ్రమ ద్వారా ఆ ఫీట్‌ను క్రాంతి డ్రిల్మాన్ పూర్తి చేసి గిన్నిస్ బుక్‌లో తన పేరును లిఖించాడు. దీనికి సంబంధించిన వీడియోను జీడబ్ల్యూఆర్ షేర్ చేసింది.
నాలుకతో ఫ్యాన్ రెక్కలను ఆపి రికార్డు
ఎవరూ చేయనటువంటిది, ఎవ్వరికీ సాధ్యంకాని వాటిని చేసేవారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కుతుంటుంది. తాజాగా మరో రికార్డు నమోదైంది. క్రాంతి డ్రిల్మాన్ అనే ఓ యువకుడు నాలుకతో ఎలక్ట్రిక్ ఫ్యాన్ రెక్కలను ఆపి రికార్డు సృష్టించారు.… pic.twitter.com/In6RosltHP
— ChotaNews App (@ChotaNewsApp) January 2, 2025