హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాగ్‌లింగంపల్లిలో శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్ సామగ్రి గోదాంలో ఈ ఘటన జరిగింది. వీఎస్టీ సమీపంలోని గోదాంలో భారీగా ఎగిసిపడుతున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. దట్టంగా పొగ అలుముకోవడంతో మంటలు ఆర్పేందుకు సిబ్బంది కాస్త ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు పొగతో అటుగా వెళ్లే వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. గోదాం పరిసరాల్లో బస్తీలు ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.