లేడీ డైరెక్టర్ సుధా కొంగరకు ప్రమాదం

-

లేడీ డైరెక్టర్ సుధా కొంగరకు ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇప్పుడు బెడ్ రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో ఆమె చేతికి గాయమైనట్లు కనిపిస్తుంది. ఓ హిందీ సినిమా షూట్ లో పాల్గొన్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, అప్పుడే తన చేతికి గాయం అయిందని సమాచారం. చాలా నొప్పిగా ఉందని.. కనీసం నెల రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు.

కాగా.. సుధా కొంగర గురు, ఆకాశమైంది హద్దురా వంటి సూపర్ హిట్ చిత్రాలను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం “సూరరై పోట్రూ” అనే హిందీ రీమేక్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అక్షయ్ కుమార్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాధిక మదన్ నటిస్తున్నారు. అయితే సుధా కొంగరకి ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news