DGP అంజనీ కుమార్ ను ఏపీకి పంపించండి – ఎమ్మెల్యే రఘునందన్ రావు

-

తెలంగాణ ఐఏఎస్ లకు అన్యాయం జరిగిందని అన్నారు బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఎన్నికల కోసమే ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేశారని ఆరోపించారు. బీహార్ వ్యక్తినే డిజిపిగా నియమించారని చెప్పారు. ఏపీ కేడర్ కు చెందిన డీజీపీ అంజని కుమార్ ను ఆ రాష్ట్రానికి పంపించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. కీలక పోస్టులలో ఒక్క తెలంగాణ అధికారిని కూడా ప్రభుత్వం నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల జరిగిన 93 మంది ఐపీఎస్ ల బదిలీలలో నాలుగు కీలక పోస్టులను బీహార్ కి చెందిన అధికారులు అంజని కుమార్, సంజయ్ కుమార్ జైన్, షానవాజ్ ఖాసీం, స్వాతి లక్రాకు కేటాయించారని అసహనం వ్యక్తం చేశారు. వీరంతా బీహార్ కు చెందిన వారేనని స్పష్టం చేశారు. సైబర్ సెక్యూరిటీ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర ని నియమించారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన స్టీఫెన్ రవీంద్ర ది ఆంధ్ర ప్రదేశ్ అని తెలిపారు రఘునందన్ రావు. తెలంగాణ వారికి కీలకమైన పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news