ఒకప్పుడు ప్రతి ఇంటి గోడలపై ఓ స్త్రీ రేపు రా అని రాసి పెట్టేవాళ్లు.. మీకు గుర్తుందా. ఆ స్త్రీ ఇప్పుడు వచ్చినట్లుంది.. ఇమాజిన్.. అర్థరాత్రి..నడిరోడ్డుపై బట్టలు లేకుండా ఓ స్త్రీ జుట్టు విరబోసుకుని తిరుగుతూ.. ఇంటి కాలింగ్ బెల్ కొట్టి..చంపుతా అని అరిస్తే.. అసలు ఆ సీన్ ఎలా ఉంటుందో. ఇది సీన్ కాదు.. రియల్.. ఈ ఉదాంత అంతా సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది..! ఉత్తర ప్రదేశ్లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఓ స్త్రీ అర్ధరాత్రి వేళ ఒంటిపై దుస్తులు లేకుండా నగ్నంగా వీధుల్లో తిరుగుతూ ప్రతి ఇంటి కాలింగ్ బెల్ మోగిస్తోంది. చంపుతానంటూ బెదిరిస్తూ అక్కడి ప్రజలను నిద్రపోనివ్వకుండా భయంతో చంపేస్తోంది. ఓ మహిళ నగ్నంగా అర్ధరాత్రి వేళ ఇంటి తలుపులు తట్టడం, కాలింగ్ బెల్ మోగిస్తుండటంతో స్థానికులు భయపడిపోతున్నారు. ఉత్తరప్రదేశ్లో మహిళ నగ్నంగా భయపెడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంటి యజమానులు తలుపులు తెరిచేలోపే అక్కడి నుంచి మాయమైపోతోంది. భయపెట్టే విధంగా ఉన్న సంఘటన ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లా మిలక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహిళ నగ్నంగా రోడ్లపై తిరగడం, ఇంటి కాలింగ్ బెల్ మోగించడంతో స్థానికులకు రాత్రుళ్లు నిద్ర ఉండటం లేదు. సీసీ ఫుటేజ్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విస్తృతంగా ప్రచారం చేయడంతో ఈ వీడియో వైరల్గా మారింది.
బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.. బట్టలు లేకుండా రోడ్లపై తిరుగుతున్న అదృశ్య మహిళ ఆచూకిని గుర్తించారు. ఆమె ఎవరూ ..? ఎందుకు అలా చేస్తుందో .? మహిళ తల్లిదండ్రులతో మాట్లాడారు. మహిళ మానసీక ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని గత ఐదేళ్లుగా బరేలీలో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటోందని తేల్చారు.
తల్లిదండ్రులకు ఆమెను అర్ధరాత్రి అలా బట్టలు లేకుండా బయటకు రాకుండా చూసుకోవాలని సూచించారు.. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయవద్దని హెచ్చరించారు.