హైదరాబాద్ వాహనదారులకు గుడ్ న్యూస్..రిజిస్ట్రేషన్లపై కీలక ప్రకటన

-

హైదరాబాద్ వాహనదారులకు గుడ్ న్యూస్. రిజిస్ట్రేషన్లపై కీలక ప్రకటన వెలువడింది. వాహనదారులకు ప్రాంతీయ రవాణా అథారిటీ గుడ్ న్యూస్ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో ఆన్లైన్ లో వాహనాల రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ స్లాట్ల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్టిఏ వెబ్సైట్ లో పలు మార్పులు చేశారు.

400 నుంచి 500 స్లాట్ల సంఖ్యను పెంచగా, ఆర్టిఏ వెబ్సైట్ లో లేదా మీసేవ కేంద్రాల్లో వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ లో స్లాట్ ను బుక్ చేసుకోవచ్చని రవాణాశాఖ అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాదు తో పోల్చుకుంటే రంగారెడ్డి జిల్లాలో వాహనాల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో రంగారెడ్డి ఆర్టీఏ అధికారులు ఎక్కువ స్లాట్లను అందుబాటులో ఉంచారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ తో తిరుగుతున్న వెహికల్స్ పై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ లో స్లాట్ దొరకాలంటే ఒక్కొక్కసారి నెల రోజులకు పైగా కూడా సమయం పడుతుంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news