సాధారణంగా కొన్ని కొన్ని విషయాలలో హీరోయిన్లకి కూడా హీరోలు లక్కీగా మారుతూ ఉంటారు. ఉదాహరణకు గతంలో చంద్రమోహన్ ఎంతోమంది హీరోయిన్లకు లక్కీ హీరోగా మారిన విషయం తెలిసిందే. శ్రీదేవిని మొదలుకొని జయసుధ వరకు చాలామంది ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత వారందరూ కూడా స్టార్ హీరోయిన్స్ అయిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెరపైకి మరొక వార్త వైరల్ అవుతుంది. అదేమిటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో పెళ్లి కానీ అమ్మాయిలు నటిస్తే.. వారికి పెళ్లి జరగడం పక్కా అంటూ ఇప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. హీరో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె రామ్ చరణ్ కు భార్యగా కనిపించింది. ఈ సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఆలియా పెళ్లి జరిగిపోయింది. ఎన్నో సంవత్సరాలుగా ప్రేమిస్తున్న తన బాయ్ ఫ్రెండ్, హీరో రణబీర్ కపూర్ ను ఆమె వివాహం చేసుకుంది. ఇక వివాహం జరిగిన వెంటనే వీరికి ఒక పాప కూడా జన్మించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా రామ్ చరణ్ తో ఇంతకుముందు కియారా అద్వానీ కూడా వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో కూడా సినిమా చేస్తోంది. ఆమె కూడా నిన్న తన బాయ్ ఫ్రెండ్ , హీరో సిద్ధార్థ మల్హోత్రాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. జై సల్మేర్ లోని ఒక ప్యాలెస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలోనే ఆమె మళ్ళీ శంకర్ , రామ్ చరణ్ సినిమాలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.. ఒకరకంగా చెప్పాలి అంటే కియారా అద్వానీ , ఆలియా రాంచరణ్ తో నటించడానికి వారి పెళ్లికి ఈ సంబంధం లేదు. కానీ ఆదృచ్ఛికంగా అతనితో నటించగానే వారి పెళ్లి జరగడంతో పెళ్లి కాని హీరోయిన్లకు ఈ హీరో లక్కీ అంటూ అభిమానులు చెప్పుకుంటున్నారు.