ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ టెస్ట్ సిరీస్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నాగ్ పూర్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్ పూర్ వేదికగా బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ను ఎంచుకుంది.
అయితే, టాస్ గెలిచిన ఆనందం వారికి ఎంతో సేపు నిలవలేదు. టీమిండియా పేసర్లు మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ లు ఆదిలోనే ఇద్దరు ఓపెనర్లను పెవిలియన్ కు చేర్చారు. రెండు పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను సిరాజ్ LBWగా ఔట్ చేశాడు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 2 పరుగుల వద్ద స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను షమీ బౌల్డ్ చేశాడు. దీంతో డేవిడ్ వార్నర్ వికెట్ గాల్లోనే 5 పల్టీలు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
What a ball, Shami. pic.twitter.com/nts6lBiDJU
— Johns. (@CricCrazyJohns) February 9, 2023