పిల్లనిచ్చిన మామచెవిలో వెంట్రుకలు ఉంటే ఆ అల్లుడికి ఏమవుతుందో తెలుసా..?

-

భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంత విడ్డూరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వినడానికి విచిత్రంగా అనిపించినా కొంతమంది వాటినే అనుసరిస్తూ ఉంటారు. ఈ మూడనమ్మకాలు మనుషుల నరనరాల్లో ప్రవహిస్తున్నది. అయితే.. ఉన్న నమ్మకాలు చాలవన్నట్లుగా ఈ జాబితాలోకి మరోకొత్త మూడనమ్మకం వచ్చి చేరింది. ఇంకెందుకు ఆలస్యం అదేంటో మీరూ తెలుసుకోండి.

పిల్లి 

ఇంటి నుంచి ఎక్కడికైనా బయలు దేరుతుండగా పిల్లి ఎదురొస్తే.. అది కూడా నల్లపిల్లి ఎదురొస్తే.. ఇలా జరుగడం శకునం అని, వెళ్లాల్సిన పని అయనట్టే అని వెనుదిరిగి ఇంటికొస్తారు. కొంతమంది అయితే కాసేపటి తర్వాత వెళ్తారు. బాగా మూఢనమ్మకాలు నమ్మేవారయితే ఇంట్లోనే తిష్టవేస్తారు. ఎదురొచ్చినా పిల్లిని నాలుగు తిట్లు తిట్టడం మాత్రం ఖాయం. పిల్లి మాత్రమే కాదు. దారిలో వెళ్తున్నప్పుడు శవం ఎదురొచ్చినా.. చచ్చిన శవాన్ని తమ తిట్లతో మళ్ళీ మళ్ళీ తిడుతారు.

తమ్ము 

జలుబు, దగ్గు, జ్వరం ఇవన్నీ ఎలాగో తుమ్ము కూడా అలానే. అయితే దీన్ని తుమ్మును మాత్రం శకునంగా భావిస్తారు పెద్దలు. ముఖ్యమైన పని జరుగుతున్నప్పుడు, మొదలుపెడుతున్నప్పుడు ఎవరికైనా కర్మగాలి తుమ్మొచ్చి తుమ్మితే ఇక వారి పని అంతే. కొట్టినంత పని అవుతుంది. అయితే అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే.. తమ్ము అనేది వచ్చే ప్రమాదాన్ని ముందుగా తెలియజేసే సిగ్నల్ లాంటిదని గుర్తించాలి. తమ్ముని కాసేపటి తర్వాత పని మొదలుపెడితే ఎలాంటి ఆటంకం ఉండదు. అంతేకాని తుమ్మడం వల్లనే ఇలా జరిగిందని అనుకోవడం మాత్రం మూర్ఖత్వం.

చెవిలో వెంట్రుకలు 

ఈ మూడనమ్మకాలతో పాటు మరో నమ్మకం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. పిల్లలను ఇచ్చే మామచెవిలో వెంట్రుకలు ఉంటే ఆ అల్లుడు అదృష్టవంతుడు, ధనవంతుడు అవుతాడని నమ్మకం అట. అందుకనే అప్పట్లో చెవిలో వెంట్రుకలు ఉన్న వ్యక్తి కూతుర్ని చూసి మరీ చేసుకునే వారట అబ్బాయిలు. ఈ సంప్రదాయాన్ని అప్పట్లో ఎక్కువగా విశ్వసించేవారు. కాలక్రమేణా మరుగైంది. అలా అని ప్రతి మగవారి చెవిలోనూ వెంట్రుకలు ఉండవు. వందలో అయిదుగురికి మాత్రమే అలా వెంట్రుకలు ఉంటాయి. అమ్మాయి కోసం వెదుకుతూ ఉంటే చెవిలో వెంట్రుకలు ఉన్న వ్యక్తి కూతుర్ని పెండ్లి చేసుకునేందుకు ప్రయత్నించండి. కాని, చెవిలో వెంట్రుకలు ఉన్న వ్యక్తి కూతుర్నే పెండ్లి చేసుకుంటానని పట్టుబట్టి కూర్చుంటే ఇక బ్రహ్మచారిగానే ఉండిపోవాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news