టర్కీలో మృత్యుఘోష.. భూకంప ధాటికి 36వేల మంది మృతి

-

టర్కీ, సిరియాలను వరుస భూకంపాలు అతలాకుతలం చేశాయి. వేల మందిని బలి తీసుకున్నారు. లక్షల మందిని తీవ్రంగా గాయపరిచాయి. మరెంతో మందిని తమ ఆత్మీయులకు దూరం చేశాయి. భూకంపం సంభవించి వారం దాటినా.. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వేల సంఖ్యలో కుప్పకూలిన భవనాల శిథిలాల కింద ఇంకా చిక్కుకునే ఉన్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

టర్కీలో సంభవించిన ఈ భూకంపం 100 ఏళ్ల కాలంలో కనీవినీ ఎరగనిదని పరిశీలకులు అంటున్నారు. ఈ ప్రకృతి విపత్తులో 35వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. 1,05,505 మంది గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డొగాన్‌ చేసిన ప్రకటన తీవ్రతను వెల్లడిస్తోంది. మరోపక్క రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతుండగానిరాశ్రయులుగా మారిన బాధితులకు కనీస అవసరాలు తీరడంలేదు. 1939లో సంభవించిన ఎర్జింకాన్‌ భూకంపం కారణంగా 33 వేలమంది పౌరులు మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news