దేశ ప్రజలకు సీఎం కేసీఆర్‌ మహాశివరాత్రి శుభాకాంక్షలు

-

దేశవ్యాప్తంగా భక్తులంతా శివ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆలయ ప్రాంగణాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులతో కోవెలలన్నీ కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు ప్రజలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతూ విషెస్ చెబుతున్నారు.

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దేశ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆత్మశుద్ధిని, పరివర్తనను కలిగిస్తాయని అన్నారు. మహాశివుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. ఆ పరమేశ్వరుడి కృపతో దేశ ప్రజలు, రైతులు సుభిక్షంగా.. సుఖశాంతులతో.. ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఆరోగ్యం పాడుచేసుకోకూడదని సూచించారు.

మరోవైపు రాష్ట్రంలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు స్వామివారి  దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో క్యూలైన్లలో బార్లు తీరారు.

Read more RELATED
Recommended to you

Latest news