సీనియర్ వైద్యుల వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు యత్నించారు. అనస్తీషియా విభాగంలోని పీజీ వైద్యురాలు డాక్టర్ ప్రీతి ఈ రోజు తెల్లవారుజామున విధుల్లో ఉండగా హానికరమైన ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన తోటి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్‌దాస్ ధ్రువీకరించారు.
రెండు రోజుల క్రితం సీనియర్ వైద్యులు డాక్టర్ ప్రీతిని వేధించినట్లు సమాచారం. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో వేధింపులకు గురిచేసిన సీనియర్ వైద్యులను మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మందలించారు. అయినప్పటికీ ప్రీతి ఆత్మహత్యకు యత్నించడం చర్చనీయాంశమైంది.